హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, వైద్యులు జాడి రాజు అన్నారు. గురువారం హైదరాబాద్లోని బీసీ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేత మాలోత్ దశరథ్నాయక్ అధ్యక్షతన ఉద్యమకారుల సమావేశం జరిగింది.
ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్యమకారులను సన్మానించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నా రు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి,ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ధరావత్ లింగనాయక్, టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతికుమార్ పాల్గొన్నారు.