కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Karepalli KGBV ) ప్రిన్సిపల్ జి. ఝాన్సీ సౌజన్య ( Jhansi Soujanya ) దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఖాన్ అకాడమీ ( Khan Academy ) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. కేజీబీవీని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు గాను ఎస్వో ఝూన్సీని ఖాన్ అకాడమీ నిర్వాహకులు సన్మానించి, సత్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ, ప్రపంచస్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఖాన్ అకాడమీ సంస్థను నెలకొల్పింది . డిజిటల్ లెర్నింగ్‌తో పాటు ఉన్నత, నాణ్యత విద్యాలయాలుగా , ఇంటర్నేషనల్ బాకలరేట్(IB), పాఠ్యాంశాలకు అనుగుణంగా, నైతిక విలువలు, నాయకత్వం, సృజనాత్మకత , విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు కృషి చేసినందుకుగాను రాష్ట్రంలోని మూడు కేజీబీవీ పాఠశాలలను ఎంపిక చేయగా కారేపల్లి కేజీబీవీ రాష్ట్రస్థాయిలో వంద శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.