HomeTelanganaHome Minister Mahmood Ali That With The Friendly Policing System Law And Order Has Increased In The State And Crime Has Come Under Control
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల అదుపు
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య వస్థతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పెరిగి నేరాలు అదుపు లోకి వచ్చాయని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
తెలంగాణకు గాడ్ గిఫ్ట్ సీఎం కేసీఆర్
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తిలో ఎస్పీ నూతన భవనం ప్రారంభం
వనపర్తి/వనపర్తి టౌన్, మే 30: ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పెరిగి నేరాలు అదుపు లోకి వచ్చాయని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయ భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మ న్ కోలేటి దామోదర్, మల్టీ జోన్-2 ఐజీ షానవాజ్ ఖాశీం, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మో హన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మా ట్లాడుతూ.. రాష్ట్రంలో పటిష్ఠమైన పోలీస్ బందోబస్తును అమలు చేస్తుండటం వల్లే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు 64 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా తెలంగాణకు గాడ్ గిఫ్ట్ అని కొనియాడారు. 100 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రణాళికలను రూపొందించారని తెలి పారు.
రాష్ట్రంలో పోలీస్ సేవలను విస్తరించామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. రూ 2.5 కోట్లతో మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు నిర్మించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తి తదితరులు పాల్గొన్నారు.