హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. ఈ సారి ఒక రోజు అదనంగా సెలవులు ఇచ్చింది. శనివారం నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇచ్చారు. తిరిగి కాలేజీలు అక్టోబర్ 6 (సోమవారం) నుంచి పునఃప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. వాస్తవానికి ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇవ్వాల్సి ఉండగా, ఒకరోజు ముందుగా అంటే ఈ నెల 27 నుంచే సెలవులు ఇచ్చారు. సెలవు రోజుల్లో కాలేజీలు నడపొద్దని హెచ్చరించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు.