హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు మెదక్ డీఈవో వెల్లడించారు. ఇక కాకతీయ వర్సిటీలో శుక్రవారం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల దృష్ట్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న పేర్కొన్నారు.
హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో కూడా పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.