వర్ధన్నపేట, ఫిబ్రవరి 7: రహదారులపై ప్రమాదవశాత్తు గాయాలపాలైన క్షతగాత్రులకు తక్షణమే సహాయం అందించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. శుక్రవారం దమ్మన్నపేట సమీపంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వస్తూ కుక్కను తప్పించబోయి మంద రాకేశ్(20) అనే యువకుడిని ఢీ కొట్టాడు.
అదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న వినోద్‌కుమార్ వెంటనే తన వాహనంలో క్షతగాత్రుడిని వర్ధన్నపేట దవాఖానకు పంపించారు.