హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా కమిటీల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్‌కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర రాష్ట్ర శాఖకు ఆరుగురు డివిజనల్ కో-ఆర్డినేటర్లను ప్రకటించారు. నాసిక్ డివిజన్‌కు అహ్మద్‌నగర్‌కు చెందిన దశరథ్ స్వాంత్ , పుణె డివిజన్‌కు బాలసాహెబ్ జయరాం దేశ్‌ముఖ్, ముంబై డివిజన్‌కు రాయిగఢ్కు చెందిన విజయ్ తానాజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్‌కు అహ్మద్‌నగర్‌కు చెందిన సోమనాథ్ తోరట్, నాగపూర్ డివిజన్‌కు నాగపూర్‌కు చెందిన ద్యానేశ్ వాక్దుకర్, అమరావతి డివిజన్‌కు అమరావతికి చెందిన నిఖిల్ దేశ్‌ముఖ్‌ను నియమించారు. ఈ విషయాన్ని బుధవారం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
