యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట వరకు 40 కి.మీ. మేరకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. ఈ పాదయాత్ర మూడు రోజులపాటు సాగనుంది.