హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇష్టారాజ్యంగా కీలక పదవులను సృష్టించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కన్సల్టెంట్ల పేరుతో రిక్రూట్మెంట్ చేసుకోవడం వివాదాస్పదమవుతున్నది.
ఇప్పటికే నలుగురిని నియమించగా, నేడో, రేపో మరో ఇద్దరిని నియమించుకునేందుకు పావులు చకాచకా కదుపుతున్నారు. వీరిలో ఒకరిని ఓఎస్డీగా, మరొకరిని రీసెర్చ్ కోసం, ఒకరిని ఇండస్ట్రీ కో ఆర్డినేటర్‌గా నియమించారు. వీరికి లక్ష నుంచి రూ. 50వేల వరకు వేతనం నిర్ణయించినట్టు తెలిసింది.
డిప్యూటేషన్‌పై వర్సిటీలు, ప్రభుత్వశాఖల్లో పనిచేసే వారిని తీసుకునే వీలున్నా కన్సల్టెంట్ల పేరుతో నియామకాలు చేపట్టడంపై విమర్శలొస్తున్నాయి. ఉన్న త విద్యామండలి ఉన్నతాధికారి స్పందిస్తూ పరిశోధన, పరిశ్రమలను అనుసంధానించడంలో భాగంగాకొత్త వారిని నియమించుకున్నట్టు తెలిపారు.