TG CPGET 2024 | తెలంగాణ సీపీగెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబ్రాది విడుదల చేశారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జూలై 6 నుంచి 16 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. నాలుగు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరిగాయి. 45 కోర్సులకు మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఇందులో 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. 96.55శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆయా విద్యార్థులకు రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎస్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ బయో టెక్నాలజీతో పాటు మొత్తం 41 కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.