హనుమకొండ చౌరస్తా/నయీంనగర్, మే 20: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రి క్త వాతావరణం నెలకొన్నది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వి ద్యార్థులు కేయూ పరిపాలన భవనం ఎదు ట మంగళవారం కూడా ఆందోళనకు దిగా రు.
విషయం తెలుసుకున్న కేయూ, హనుమకొండ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు ఎంతకీ వినకపోవడంతో పోలీసుల కు విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులా ట జరిగింది. విద్యార్థులను లాక్కెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. లేడీ కానిస్టేబుళ్లు లేకుండానే తెల్లవారుజాము 3 గంటలకు వరకు తమను కేయూ పోలీసు స్టేషన్లో ఉంచినట్టు విద్యార్థినులు అనూష, స్వాతి పేర్కొన్నారు.