హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): టీచర్ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీకి హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులొచ్చాయి. వికారాబాద్ నుంచి 9,772, నల్లగొండ నుంచి 9,041 దరఖాస్తులు నమోదయ్యాయి. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి నుంచి 1,338 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. మొత్తం మీద డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. పోస్టుల వారీగా తీసుకొంటే ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు 60,460, ఎస్ఏ సోషల్ స్టడీస్‌కు 28,019 దరఖాస్తులొచ్చినట్టు వెల్లడించారు.