HCA | హైదరాబాద్, జూన్ 12 ( నమస్తే తెలంగాణ) : స్పోర్ట్స్‌లో సీఎం కప్ ఉన్న విషయం మనకు తెలుసు. కానీ స్పోర్ట్స్‌లో సీఎం కోటా ఉన్నదనే విషయం మీకు తెలుసా? కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వరకైతే లేదు, కా నీ, ఇప్పుడు వచ్చింది. హెచ్‌సీఏ పాలక వర్గా న్ని ఎన్నుకొనే దగ్గర నుంచి మొదలుకొని ఏపీఎల్ టికెట్లు అమ్ముకొనే వరకు అన్నిట్లో ము ఖ్యనేత కోటా రిజర్వ్ చేసి పెట్టాల్సిందేనట! షాడో సీఎంవోకు భూ కబ్జాలు పలుచబడ్డా యి. పోస్టింగ్‌లు, సెటిల్మెంట్లు పాతబడ్డా యి. ఇప్పుడు నగదు నిల్వల మీద కన్నుపడ్డ ది. ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. అట్లా షాడో సీఎంవో సభ్యుడు, ము ఖ్యనేతకు అత్యంత ప్రాణపదమైన ఆత్మ ఒకటి ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ప ట్టింది. ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల లా వాదేవీలున్న హెచ్‌సీఏను పీల్చిపిప్పి అక్కడే అడ్డా వేసింది. తొలి ప్రయత్నంలోనే రూ.30 కోట్ల బోణీ కొట్టింది. రూ.కోట్లు పెట్టి పదవిలో కి వచ్చిన కొత్త పనిమంతుడు ముఖ్యనేత ఆ త్మ అండతో హెచ్‌సీఏలో ఇష్టారాజ్యాన్ని సుస్థి రం చేసుకున్నారు.
హెచ్‌సీఏకు ఏం కావాలో? ఏం చేయాలో? ఆయనే డిసైడ్ చేస్తారట! త ను కన్ను గీటితేనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కదలాలట! ఎవరైనా ‘కాదు’ అని అ డ్డంగా తలూపితే.. వాళ్ల ఇంటి మీదకి ఏసీబీ పోలీసులు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని హెచ్‌సీఏ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతలకు హె చ్‌సీఏ టార్గెట్‌గా మారింది. నగదు నిల్వలు, ప్రపంచ స్థాయి బిజినెస్మెన్లతో పరిచయాలు పెరిగే అవకాశం ఉండటంతో ముఖ్యనేతలు, మంత్రులు హెచ్‌సీఏ మీద పడ్డారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడులైంది. అంతకు ముందున్న కార్యదర్శి అవినీతి ఆరోపణల్లో అరెస్టయ్యా రు.
ఆయన పదవీకాలం కూడా ముగియడం తో పాలకమండలి ఎన్నికల కోసం నోటిఫికేష న్ ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే ముఖ్యనేత ఆత్మ ఎంట్రీ ఇచ్చినట్టు హెచ్‌సీఏ వర్గాలు చెప్తున్నాయి. రెండు పదవుల్లో ఒకటి ముఖ్యనేత కోటా కింద తమకు ఇవ్వాల్సిందేనని, తాము సూచించిన వ్యక్తికి ఏకగ్రీవం చేయాలని పట్టుబట్టినట్టు చెప్తున్నాయి. ఆత్మ జారీ చేసిన ఆర్డర్‌ను పాలకవర్గంలోని కొందరు సభ్యులు, క్రికెట్ క్లబ్‌లు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఎవరైతే షాడో సీఎంవో నేతకు వ్యతిరేకంగా మాట్లాడారో మరుసటి రోజే వాళ్లందరికీ ఏసీబీ, సీఐడీ పోలీసులు నుంచి వరుస ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత నేరుగా ముఖ్యనేత ఫోన్లైన్లోకి వచ్చి, ‘మావాడు సూచించిన వ్యక్తికి కీలక పోస్టు అప్పగించండి’ అని ఆదేశించినట్టు హెచ్‌సీఏ సభ్యులు చెప్తున్నారు. ఆయన ఆదేశాలతో ఆందోళనకు గురైన కొత్త అధ్యక్షుడు తీవ్ర అస్వస్థతతో దవాఖాన పాలైనట్టు సమాచారం.
రూ.30 కోట్లకు కీలక పోస్టు బేరం
ముఖ్యనేత కోటా కింద రిజర్వ్ చేసి పెట్టిన పోస్టును షాడో సీఎంవో సభ్యుడు మార్కెట్లో పెట్టినట్టు చెప్తున్నారు. రూ.50 కోట్ల డిమాండ్‌తో వేలంలో పెట్టగా ముఖ్యనేత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి రూ.30 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. మార్చిలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇది పోగా నోటిఫికేషన్లో పేర్కొన్న మరో పోస్టుకు మాత్రం ఎన్నికలు జరిగినట్టు చెప్తున్నారు. ముఖ్యనేత కోటాలో కీలక పదవికి ఎన్నికైన వ్యక్తికి అర్హతలు లేకుండానే హెచ్‌సీఏలోకి చొరబడ్డట్టు విమర్శలున్నాయి. వాస్తవానికి ఆయన రాజకీయ నాయకుడు, క్రికెట్‌తో పెద్దగా పరిచయాలు కూడా లేవనే చెప్తున్నారు. కానీ హెచ్‌సీఏలో కీలక పోస్టు లాభసాటి వ్యాపారంగా ఉండటంతో నిరుడు నవంబర్‌లో రంగారెడ్డి జిల్లాలోని ఓ క్రికెట్ క్లబ్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. తాను కొనుగోలు చేసిన క్రికెట్ క్లబ్‌కే మరోసారి హైదరాబాద్‌లో రీ రిజిస్ట్రేషన్ చేయించినట్టు నివేదికలు చెప్తున్నాయి. లాభసాటి వ్యాపారం, ఈ క్లబ్‌లను అమ్మడం, కొనడం నేరం. పైగా ఒక జిల్లా నుంచి తీసుకొని వెళ్లి మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించడం చట్టవిరుద్ధం. కానీ చట్టమే వీళ్లకు చుట్టం అయినప్పుడు ఏదీ అడ్డుకాదని, ముఖ్యనేత పంపిన షాడో కార్యాలయంలో కూర్చొని అన్ని పనులూ చక్కబెట్టినట్టు చెప్తున్నారు.
ఆయనకు బెడ్ రెస్ట్.. ఈయన బ్లాక్‌మార్కెట్
ముఖ్యనేత ఆదేశాలతో తీవ్ర అస్వస్థతకు గురైన కొత్త అధ్యక్షుడు, దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ బెడ్ రెస్టుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ముఖ్యనేత ఆత్మ, కీలక పాలక మండలి సభ్యులు హెచ్‌సీఏను ఇష్టారాజ్యంగా మలుచుకున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి? ప్రెసిడెంట్‌గా ఎవరుండాలి? ఎవరు సెక్రటరీ? ఎవరు ట్రెజరరీ? ఇలామొత్తం వీళ్లు చెప్పినట్టే నడువాలట! ప్రతిదీ డిసైడ్ చేసే రాజ్యాంగేతర శక్తులుగా మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు విమర్శలు వస్తున్నాయి.
రూ.20 వేల విలువైన టికెట్ల వ్యవహారం రూ.కోట్ల అవినీతి దందాలకు దారితీసిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించడం హెచ్‌సీఏలో నెలకొన్న దుర్మార్గాలను బహిర్గతం చేసింది. ఐపీఎల్ సీజన్లో నల్లాలు, వాష్ బేసిన్లు, వెస్ట్రన్ కమోడ్స్ మరమ్మతులు, కొనుగోలు కోసం భారీ ఎత్తున నిధులు దుబారా చేసినట్టు ఆరోపణలున్నాయి. గత సీజన్లో చేసిన పనులనే మళ్లీ చేసినట్టు రికార్డులు సృష్టించినట్టు హెచ్‌సీఏ భాగస్వామ్య క్రికెట్ క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీజన్లో రూ.కోట్లతో క్రికెట్ బంతులు, క్రికెట్ కిట్, ఎలక్ట్రిక్ సామగ్రి, క్రీడాకారుల వస్ర్తాలు కొన్నట్టుగా బిల్లులు తెప్పించి నిధులు దారి మళ్లించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.