పోలీసు పోస్టుల భర్తీ షెడ్యూల్‌ను సమర్పించండి
పోలీసుశాఖలో పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ మేరకు నియామక షెడ్యూల్‌ను సమర్పించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
- పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): పోలీసుశాఖలో పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ మేరకు నియామక షెడ్యూల్‌ను సమర్పించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పోలీసు శాఖలో ప్రభుత్వం ఆమోదం తెలిపిన 7,400 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో అందజేయాలని పేర్కొన్నది. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ పిల్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 5 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పత్రికా ప్రకటన జారీచేసిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

