హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏండ్ల మాజీ ఎస్ఐని ఇంటి నుంచి బలవంతంగా లా కెళ్లి అనుచితంగా ప్రవర్తించారనే కేసులో మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరైన ఎస్ఐని భోజన విరామం వరకు కోర్టు హాల్లోనే నిలిచి ఉండాలని ఆదేశించింది. ఒక మాజీ పోలీసు అధికారి విషయంలోనే అనుచితంగా వ్యవహరించారంటే ఇతరుల విషయంలో ఇంకెలా ఉంటారని వ్యాఖ్యానించిం ది.
మే 18న యూసఫ్‌గూడలో తాను ఇంటి లో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డు ఎస్సై మహ్మద్ ఉస్మాన్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఎస్ఐ స్వయం గా విచారణకు హాజరుకావడంతో ఆయన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. పోలీసులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.