హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని షేక్‌పేట సర్వే నంబర్ 403లో ఆనంద్ సినీ సర్వీసెస్ సంస్థకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కేటాయింపు జరిపిందని, ఇందులో చట్టవిరుద్ధమేమీ లేదని స్పష్టం చేసింది.
ఈ భూకేటాయింపును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు 2008లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది.