హైదరాబాద్, ఫిబ్రవరి 23 ( నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ)లపై నమోదు చేసిన క్రిమినల్ కేసు విచారణను హైకోర్టు శుక్రవారం నిలుపుదల చేసింది. బోధన్ కోర్టులో అడిషనల్ పీపీలు (టెన్యూర్)గా పనిచేస్తున్న జీ శ్యాంరావు, వీ సమ్మయ్య దాఖలుచేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ కే సుజన శుక్రవారం విచారణ జరిపారు. బోధన్ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.