హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ శాఖలో స్కాలర్షిప్ల కుంభకోణంపై 2003లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు కేవీఎల్ జయసింహకు హైకోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. మిగిలిన వారిని నిర్దోషులుగా తేల్చింది.
ఈ మేరకు హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కాలేజీలు లేకపోయినా ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి రూ.22 కోట్ల మేరకు సాలర్షిప్లను స్వాహా చేశారని 2003లో కేసు నమోదైంది.