హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘అఖండ-2’ టికెట్ ధరల పెంపు వివాదంలో చిత్ర నిర్మాతకు ఊరట లభించింది. పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 15వరకు నిలిపివేసింది.
10న ప్రభు త్వం జారీ చేసిన మెమో ప్రకారం ‘అఖండ-2’ టికెట్ ధరలను పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపునకు అనుమతించే అధికారంపై అన్ని పక్షాలు సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని పేర్కొన్నది. ధరల పెంపు అమలును నిలిపివేసినా పెంచిన ధరల ప్రకారమే ‘బుక్ మై షో’ టికెట్లను విక్రయించినందుకు కోర్టు ధిక్కార నేరం కింద ‘బుక్ మై షో’కు నోటీసులు జారీ చేశారు.