హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అప్పులుచేసి చనిపోయిన వ్యక్తి రుణభారం నుంచి అతని వారసులు తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టంచేసింది. భార్య, పిల్లల ఆస్తులతో ఆ అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే వారసత్వంగా సంక్రమించిన కుటుంబ ఆస్తిని రుణాల చెల్లింపునకు వినియోగించవచ్చని తెలిపింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్-6తోపాటు న్యాయసూత్రాలను ప్రస్తావించిన కోర్టు, 1864 నాటి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూళ్లు మరణించిన వ్యక్తి వాటాకు మాత్రమే పరిమి తం కావాలన్న వాదనను తిరసరించింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన పోస్టుమాస్టర్ నుంచి రూ.15.71 లక్షలు వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద అధికారులు ఆస్తులను జప్తు చేయడా న్ని సవాల్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మం డలం జలాల్‌పూర్‌కు చెందిన ఆయన భార్య హైకోర్టు ను ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ అలిశెట్టి ల క్ష్మీనారాయణ విచారించారు. పిటిషనర్ తరఫు న్యా యవాది వాదిస్తూ, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం విషయం తన క్లయింట్‌కు తెలియదని, పూర్వీకుల ఆ స్తే పిటిషనర్‌తోపాటు ఇద్దరు పిల్లలకు జీవనాధారమ ని, భర్త మరణించిన తర్వాత ఆ ఆస్తిపై కుమారులకే హకు ఉంటుందని పేరొన్నారు. ప్రభుత్వం బకాయిలను వసూలు చేయాలనుకుంటే, పూర్వీకుల ఆస్తిలో మరణించిన వ్యక్తి వాటా వరకు మాత్రమే పరిమితం కావాలని, ఇతర వారసుల వాటాలను జప్తు చేయరాదని వాదించారు. ఇందుకు చెందిన రెవెన్యూ రికార్డులను సమర్పించినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ భర్త ప్రభుత్వ నిధుల ను అక్రమంగా మళ్లించిన విషయం నిర్ధారణ అయిందని, ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల మాదిరిగానే రెవె న్యూ రికవరీ చట్టం ద్వారా వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని వివరించారు. వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, హిందూ వారసత్వ (సవరణ) చట్టం-2005తో తండ్రి అప్పులను కుమారులు తమ వ్యక్తిగత ఆస్తులతో తీర్చాల్సిన పుత్రధర్మ బాధ్యత రద్దయిందని గుర్తుచేశారు. అయితే, వారసత్వంగా సంక్రమించిన కుటుంబ ఆస్తిపై మాత్రం చట్టబద్ధమైన అప్పుల బాధ్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు.