హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఏడేండ్ల నుంచి కనిపించకుండా పోతే చట్టప్రకారం ఆ వ్యక్తి మృతిచెందినట్టేనని.. భర్త ఉద్యోగ పదవీ తొలగింపు ప్రయోజనాలను ఆ మహిళకు, పిల్లలకు చెల్లించడంతోపాటు అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇండియన్ బ్యాంకుకు స్పష్టంచేసింది. మ హిళకు సైనిక సంక్షేమ డైరెక్టర్ 50 వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది.
ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ కుమారి భర్త వీ ఫ్రాన్సిస్‌కు ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి లభించడంతో ఢిల్లీ వెళ్లాడు. 7 నెలల తర్వాత అదృశ్యం కావడంతో 2008లో కేసు నమోదు కాగా, ఆచూకీ తెలియలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫ్రాన్సిస్ ఉద్యోగ తొలగింపు ప్రయోజనాలను చెల్లించాలని, పిల్లల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ సుగుణ కుమారి ఇండియన్ బ్యాంకు అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.