అధికారిక పత్రాలు లీక్ ఎలా అవుతున్నాయి?
రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తంచేసింది.
- అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం
- రెవెన్యూశాఖకు హైకోర్టు మందలింపు
- పత్రాల భద్రతపై నివేదికకు ఆదేశం
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తంచేసింది. అధికారిక ఉత్తర్వులు వెలువడకముందే, ఇంకా ఆమోదం పొందని నివేదికలు, పత్రా లు బయటకు చేరడం రెవెన్యూ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రికార్డుల భద్రత, గోప్యతకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించరాదని చెప్పింది.
రెవెన్యూ అధికారులకు బయటివ్యక్తులతో ఉన్న సంబంధాలపై శాఖ ముఖ్యకార్యదర్శి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. అంతర్గత సమాచారం బయటకు ఎలా వెళుతున్నదో తేల్చాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి, పత్రాల భద్రతకు తీసుకునే చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 13లోగా అందజేయాలని ఆదేశించింది.గద్వాల మండలం మేళ్లచెరువు గ్రామంలోని సర్వే నంబర్ 259/1లో 30 గుంటల భూమికి సంబంధించిన దరఖాస్తును తిరసరించాలని తహసీల్దార్ ఆర్డీవోకు పంపిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పెద్దతిమ్మన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురవారం విచారించారు. సర్వే నంబర్ 259 ధరణి/భూభారతి పోర్టల్‌లో కనిపించడం లేదని, దానిని రికార్డుల్లో చేర్చాలని పిటిషనర్ మార్చి 3న దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్, దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని, తిరసరించాలని మార్చి 18న ఆర్డీవోకు నివేదిక పంపారు.
అయితే ఆ నివేదికపై ఆర్డీవో ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోకముందే, పిటిషనర్ ఆ అంతర్గత నివేదికలోని వివరాలను తెలుసుకొని హైకోర్టులో సవాలు చేయడాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అధికారిక నిర్ణయం వెలువడకముందే అంతర్గత పత్రాలు సంబంధిత వ్యక్తులకు ఎలా అందుతున్నాయని ప్రశ్నించింది. ప్రభుత్వ పత్రాలకు సంరక్షకులుగా ఉండాల్సిన అధికారులు వాటి భద్రతకు తగిన చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. అధికారిక సమాచారం ఇవ్వకముందే రెవెన్యూ శాఖలో జరుగుతున్న వ్యవహారాలన్నీ బయటి వ్యక్తులకు తెలిసిపోవడం ఆందోళనకరమని పేరొంది. సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

