హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఉపయోగిస్తున్న దరఖాస్తు ఫారాల్లో భాషకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ దరఖాస్తులను ఏయే భాషల్లో ముద్రిస్తున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వారం రోజులకు వాయిదా వే సింది. కరీంనగర్‌కు చెందిన సామాజిక కా ర్యకర్త ఎం ముజీబ్ అయూబ్ దాఖలు చేసి న పిటిషన్‌పై న్యాయమూర్తి బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఎస్ఐఆర్ దరఖాస్తులను కేవలం తెలుగులో అందుబాటులో ఉంచడం వల్ల ఆ భాష తెలియని ఓటర్లు ఇబ్బందులు ఎదురొంటున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్ చెప్పారు. హైదరాబాద్‌లో ఉర్దూ, ఆంగ్ల భాషలు మాట్లాడేవారు ఎకువగా ఉన్నప్పటికీ వారికి తగిన భాషల్లో దరఖాస్తులు అందుబాటులో లేవని తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ఎస్ఐఆర్ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని తెలిపారు. బీఎల్వో వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూలో నమూనా ఫారా లు కూడా అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు వాటిని పరిశీలించి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. వాదన లు పరిశీలించిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను వారంరోజులపాటు వాయిదా వేసింది.