హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో కేసుల విచారణ లైవ్ ప్రొసీడింగ్స్‌ను రికార్డింగ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేరొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్‌ను వీడియో తీసి వాటిని టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం చట్ట వ్యతిరేకమని, ఇలా చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఇలా ప్రసారం చేసినవి ఆన్లైన్లో ఉంటే వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆదేశాల మేరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలిపారు.