హైదరాబాద్, డిసెంబర్ 13 (నమ స్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన నోటీసులను కొట్టివేసేందు కు హైకోర్టు నిరాకరించింది. సీఎం రే వంత్‌రెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు ను కొనుగోలు చేసేందుకు రూ.50 లక్ష ల ముడుపులు చెల్లిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే.
ఆ ము డుపులను కృష్ణకీర్తన్ సమకూర్చినట్టు ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో 20 21 ఆగస్టు 9న ఆయన కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.ఆ సమన్లను కొట్టివేయాలంటూ కృష్ణకీర్తన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ కే లక్ష్మణ్.. కృష్ణకీర్తన్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.