హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ట్రయిల్ కోర్టులో ఎన్వోసీ తెచ్చుకుంటేనే ఇవ్వాలని పాస్‌పోర్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న క్రిమినల్ కేసుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ అథారిటీ తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడంలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీంతో ట్రయిల్ కోర్టులో ఎన్వోసీ ఉంటేనే పాస్‌పోర్ట్ ఇవ్వాలని, ఎన్వోసీ కేవలం పాస్‌పోర్ట్ జారీ చేసేందుకే ఉపయోగపడుతుందని, విదేశాలకు వెళ్లాలంటే మళ్లీ ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది.