హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్) సంస్థకు విద్యుత్తు సరఫరా నిలిపివేయవద్దని, ఆ కంపెనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ని ఆదేశించింది.
ఇటీవల ఆ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయాలని పీసీబీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.