Telangana | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమ స్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట గ్రామంలో స్టే ఉత్తర్వులున్నప్పటికీ అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసిన పేదల ఇంటిని పునరుద్ధరించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పేదలు ఇల్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీసింది.
దోమలపెంటలో కటకం మహేశ్, నాగలక్ష్మి ఓ ఇల్లు కట్టుకొని చాలా ఏండ్ల నుంచి నివాసముంటున్నారు. అది అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు వారి ఇంటిని కూల్చరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిం ది. ఉత్తర్వులు అమలులో ఉండగా నే ఇంటిని కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశా రు. దీనిపై జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి వల్ల ఇది జరిగిందని, ఇది జి ల్లా పంచాయతీ అధికారికి తెలియదని చెప్పారు. కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
కురవి, డిసెంబర్ 17: రైతుబీమా సొమ్మును ఏఈవో తన ఖాతాలోకి బదిలీ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు లు తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం గుండ్రాతిమడుగు (విలేజీ) గ్రామానికి చెందిన బానోత్ బాలు, కే తం లక్ష్మణ్, హుస్సేన్ ఇటీవల మరణించగా సదరు కుటుంబాలకే రైతుబీమా మంజూరైంది. బానోత్ బాలు, కేతం లక్ష్మణ్ కుటుంబ సభ్యుల నుంచి రూ.5 లక్షల చొప్పున, హుస్సేన్ కుటుంబం నుంచి రూ.3 లక్షలు మొత్తం రూ.13 లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. బా ధితులు మంగళవారం అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏఈవో కల్యాణ్ స్పందిస్తూ.. వారి వద్ద తాను అప్పు కింద తీసుకున్నానని, తిరిగి ఇస్తానని పేర్కొన్నాడు.