High Court | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని స్పష్టంచేసింది.
తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు విద్యార్థులను తరగతులకు అనుమతించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కో టా సీట్లకు రూ.5.8 లక్షల నుంచి రూ. 24 లక్షలు, కన్వీనర్ కోటా సీట్లకు రూ.3.2 లక్షల నుంచి రూ.7.75 లక్షలకు పెంచుతూ ప్రభు త్వం జీవో జారీ చేసింది. దీనిపై విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్పం దించిన హైకోర్టు పాత ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని, తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.