హైదరాబాద్, జూలై 16, (నమస్తే తెలంగాణ): చేసిన పనులకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ దేవరాజ్, సీఈవో సునీల్ బోస్ కాంటేలకు హైకోర్టు తేల్చిచెప్పింది.
తదుపరి విచారణలోగా ఆదేశాలు అమలుచేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. రూ.19 లక్షల బిల్లు వ్యవహారంపై ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై గంజం డెకార్ సర్వీసెస్ హైకోర్టును ఆశ్రయించింది.