హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది. అమెరికాలో 2019 అక్టోబర్‌లో జన్మించిన సాత్విక్ గ్యారీని భర్త ఉమేశ్ బయరాజు అక్రమంగా తీసుకెళ్లడంతో అమెరికాలోని తల్లి సారా బయరాజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2019లో సారాఉమేశ్కు పెండ్లి జరిగింది. వాళ్లకు అదే ఏడాది అమెరికాలో సాత్విక్ పుట్టాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో 2022లో విడాకులు తీసుకున్నారు సాత్విక్ కస్టడీ బాధ్యతను అమెరికా కోర్టు ఇద్దరికీ ఇచ్చింది. కానీ కొడుకును తీసుకుని ఉమేశ్ ఇండియా వచ్చేశాడు. అమెరికా కో ర్టు బాలుడిని తల్లికి అప్పగించాలని ఉత్తర్వు లు ఇచ్చింది. బాలుడితోపాటు పాస్‌పోర్టు, ఇతర సర్టిఫికెట్లను మలక్‌పేట ఎస్‌హెచ్‌వోకు అప్పగించాలని ఉమేశ్‌ను ఆదేశించింది.