హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ఆక్రమణలకు సంబంధించి అమెరికన్ టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమర్పించిన ఫిర్యాదు మేరకు అనధికారిక ప్రతివాదులైన షేక్ సైఫుద్దీన్, ప్రైడ్ ఇండియా మాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. అనుమతి పొందిన లేఅవుట్లోని 40 అడుగుల రహదారిని సైఫుద్దీన్ కబ్జా చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అమెరికన్ టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడితోపాటు మరొకరు పిటిషన్లు దాఖలు చేయడంతో ఇటీవల ఈ ఆదేశాలు జారీచేసిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. తదుపరి విచారణను విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.