హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రోజువారీ అవసరాల కోసం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఈఈ) నుంచి విద్యుత్తు కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిసంలకు హైకోర్టు అనుమతించింది. దీంతో 60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు ఎస్పీడీసీఎల్కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. సమగ్ర వివరాలతో కౌంట ర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.
ఇరిగేషన్‌శాఖలో ప్రత్యేక ఎలక్ట్రికల్ డివిజన్!
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ప్ర త్యేకంగా ఎలక్ట్రికల్ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తున్నా రు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యాన్ని గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాఖకు ప్రత్యేకంగా 150 ఎలక్ట్రికల్ పోస్టులను మంజూరు చేసింది. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయ్యింది. ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక డివిజన్ ఏర్పా టు చేసి ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు తర్ఫీదునివ్వాలని ఈ శాఖ నిర్ణయించింది.