హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు నీటిపారుదల, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులకు, హెచ్ఎండీఏకి, జలమండలికి, జీహెచ్ఎంసీ లేక్ ప్రొటెక్షన్ కమిటీకి, ఆనంద కన్వెన్షన్, నియో కన్వెన్షన్, ఆర్య కన్వెన్షన్, కే కన్వెన్షన్, షెల్టెన్ ఉత్సవ్ కన్వెన్షన్ సెంటర్ల యాజమానులకు హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.