హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్‌పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి టీకే శ్రీదేవికి బుధవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.