హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ బీమా పథకం కింద ఆర్టీసీ కార్మికులకు రూ.131.76 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ రీజనల్ పీఎఫ్ కమిషన్ ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. ఆ నోటీసులో ఏపీఎస్ ఆర్టీసీ అని పేరొనడాన్ని ఆక్షేపించడంతోపాటు రెండు రాష్ట్రాలు ఎంతెంత బకాయిలు చెల్లించాలో వివరణ లేదని తప్పుపట్టింది.
ఈ నేపథ్యంలో నోటీసు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. రూ.131.76 కోట్ల పీఎఫ్ అనుబంధ బీమా బకాయిలు చెల్లించాలని గత ఫిబ్రవరి 11న రీజినల్ పీఎఫ్ కమిషనర్ ఇచ్చిన నోటీసు చెల్లదంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.