హైదరాబాద్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): ఎర్రకుంట బఫర్‌జోన్‌లో ని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసి, వాటిని ప్రోత్సహించారంటూ హైడ్రా చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూ రు చేసింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ని జాంపేట మున్సిపల్ కమిషనర్ పీ రా మకృష్ణారావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారించారు.
బెయిల్ మంజూరు చే సిన కోర్టు.. రెండు వారాల్లో పోలీసుల ముం దు లొంగిపోవాలని ఆదేశించిం ది. రూ.20వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు తీసుకొని విడుదల చేయాలని పో లీసులకు సూచించింది. ప్రతి శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4గం టల మధ్య 8 వారాలపాటు పీఎస్‌లో హాజరు కావాలని స్పష్టంచేసింది.