హైడ్రా కమిషనర్‌కు కోర్టు ధికరణ నోటీసు
రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
- జూన్ 9న వ్యక్తిగతంగా హాజరుకావాలన్న హైకోర్టు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది. నోటీసులు జారీ చేసినా బోర్డును తొలగించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ధికరణకు ఎందుకు పాల్పడ్డారో జూన్ 9న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నం.105లో రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకున్న హైడ్రా అకడ బహిరంగ నోటీసును ఏర్పాటుచేసింది. ఆ నోటీసును 48 గంటల్లోగా తొలగించాలంటూ హైకోర్టు గ తంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ పిటిషనర్ల స్థలంలో బోర్డు తొలగించలేదని, దీనిపై హైడ్రా కౌం టర్ దాఖలు చేయలేదని తప్పుపట్టారు.
ఉద్దేశపూర్వకంగా కోర్టు ధికరణ
మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నం.105లో తమ రెండు ప్లాట్లను హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని జితేంద్ర మరొకరు హైకోర్టులో సవాలు చేశారు. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించి కింది కోర్టు జారీచేసిన ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆ బోర్డులను 48 గంటల్లో తొలగించాలని గత నెల 13న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, కోర్టు ఉత్తర్వులను హైడ్రా అమలు చేయలేదంటూ జితేంద్ర ఇతరులు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా పిటిషనర్ల స్థలంలోని బోర్డులను హైడ్రా తొలగించలేదని చెప్పారు. హైడ్రా కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని అన్నారు.
కౌంటర్ కూడా వేయని హైడ్రా
వాదనలపై స్పందించిన హైకోర్టు.. పిటిషనర్లు సమర్పించిన ఫొటోలను పరిశీలించిన తరువాత గత ఉత్తర్వులను హైడ్రా అమలు చేయలేదనే నిర్ణయానికి వచ్చింది. హైడ్రా తన చర్యను సమర్థించుకునే తీరులో మెయిన్ పిటిషన్లో స్టేటస్ రిపోర్టు కూడా సమర్పించలేదని తప్పుపట్టింది. కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆక్షేపించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ధికరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. మెయిన్ పిటిషన్, కోర్టు ధికరణ పిటిషన్లను కలిపి వచ్చే నెల 9న విచారిస్తామని ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

