హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : అధిక లాభాల ఆశ చూపి జనం నుంచి పెట్టుబడులు సేకరించి మోసం చేసిన హీరాగ్రూప్, కంపెనీ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు హైకోర్టు రూ.5 కోట్ల జరిమానా విధించింది. హీరాగ్రూప్ ఆస్తులు వేలం వేయాలని సుప్రీంకోర్టు.. ఈడీకి గతంలో అనుమతిచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేసినందుకు హీరాగ్రూప్, ఆ కంపెనీ డైరెక్టర్ నౌహీరాషేక్ జరిమానా చెల్లించాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హీరాగ్రూప్‌నకు చెందిన 50 స్థిరాస్తులను వేలం వేసే ప్రక్రియ ఈడీ చేపట్టింది.
మెటల్స్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎన్టీన్) లిమిటెడ్ వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో వేలం కోసం 59 ఆస్తులను ఎంపిక చేసింది. ఈ నెల 26న వేలం జరగనుంది. ఆస్తుల మారెట్ విలువ కంటే తకువకు బిడ్డింగ్ ధరను కోట్ చేశారంటూ హీరా గ్రూప్, ఆ కంపెనీ డైరెక్టర్ నౌహీరాషేక్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక పిటిషనర్లకు జరిమానా విధిస్తూ కీలక ఆదేశాలు జారీచేశారు. ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చాక పిటిషనర్ పదేపదే పిటిషన్లు దాఖలు చేసి వేలం ప్రక్రియ అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని ఆక్షేపించారు. రూ.5 కోట్లు జరిమానాను ఎనిమిది వారాల్లో ప్రధానమంత్రి రిలీఫ్పండ్కు చెల్లించాలని తీర్పులో పేరొన్నారు.