‘దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో చాంగ్ కై చున్ ఉప నది ప్రవహిస్తున్నట్టుగా మన హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తున్నది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి మమ్మల్ని సియోల్ టూర్‌కు పంపారు. చాంగ్ కై చున్ చుట్టుపక్కల ఎన్నో ఆకాశహర్మ్యాలు, వాటిలో పలు రెస్టారెంట్లు వచ్చినయి. అవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన ప్రాజెక్టులు. హైదరాబాద్‌లో మూసీ పరిసర ప్రాంతాలను కూడా అలా తయారు చేస్తే ప్రపంచంలోనే గుర్తింపు వస్తుంది.’
దక్షిణ కొరియాలో పర్యటన సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు రాష్ట్ర మంత్రులు సియోల్‌లో చాంగ్ కై చున్ ఉప నది పక్కన నిలబడి మూసీ సుందరీకరణపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రణాళికను వెల్లడించిన తీరిది.
Musi Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 27 (నమస్తే తెలంగాణ): ‘దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో చాంగ్ కై చున్ ఉప నది ప్రవహిస్తున్నట్టుగా మన హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తున్నది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి మమ్మల్ని సియోల్ టూర్‌కు పంపారు. చాంగ్ కై చున్ చుట్టుపక్కల ఎన్నో ఆకాశహర్మ్యాలు, వాటిలో పలు రెస్టారెంట్లు వచ్చినయి. అవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన ప్రాజెక్టులు. హైదరాబాద్‌లో మూసీ పరిసర ప్రాంతాలను కూడా అలా తయారు చేస్తే ప్రపంచంలోనే గుర్తింపు వస్తుంది.’
దక్షిణ కొరియాలో పర్యటన సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు రాష్ట్ర మంత్రులు సియోల్‌లో చాంగ్ కై చున్ ఉప నది పక్కన నిలబడి మూసీ సుందరీకరణపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రణాళికను వెల్లడించిన తీరిది.
‘నీటి వనరుల పరిరక్షణ నిమిత్తం 2012లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ నిబంధనలను రూపొందిస్తూ జీవో 168 జారీ చేసింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. మూసీ నదీగర్భం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న అనధికారిక నివాసాలను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టండి. ఆ నిర్మాణాలను తొలగించేందుకు సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలి.’
మూసీ సుందరీకరణపై రెండు రోజుల కిందట హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి.మరి.. సామాన్యుడైనా, సర్కారైనా చట్టం అందరికీ సమానమే. మూసీ నదీగర్భం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న నిరుపేదలకైనా, మూసీ సుందరీకరణలో భాగంగా ఆ నది పొడవునా కార్పొరేట్ సంస్థలతో ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు స్కెచ్ వేసిన రాష్ట్ర ప్రభుత్వానికైనా హైకోర్టు ఆదేశాలు ఒకేలా వర్తిస్తాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సియోల్‌లోని చాంగ్ కై చున్ ఉప నది పక్కన నిర్మించినట్టుగా మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో వ్యాపార ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశం లేనట్టేనని, రేవంత్‌రెడ్డి సర్కారు సియోల్ కల చెదిరిపోయినట్టేనని అర్థమవుతున్నది.
మూసీ ప్రక్షాళనతో మురుగు నుంచి జీవనదికి మోక్షం లభిస్తుందనేది వాస్తవమే. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం మూసీ ప్రక్షాళనను పక్కనపెట్టి, సుందరీకరణలో భాగంగా కార్పొరేట్ కంపెనీలతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించినట్టు గత 11 నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు మూసీలోకి మురుగు వెళ్లకుండా నిరోధించేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా, మూసీలోకి గోదావరిజలాల తరలించే ప్రాజెక్టును మొదలుపెట్టకుండానే రేవంత్‌రెడ్డి సర్కారు ఆ నది వెంట ఉన్న నిరుపేదల నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించింది. ఈ కూల్చివేతలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెండ్రోజుల క్రితం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూసీ పరిరక్షణ కోసం నదీగర్భం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు అనుకున్నట్టుగా సియోల్ తరహాలో మూసీ వెంబడి హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వినోద, వ్యాపార కేంద్రాలతో కూడిన బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు నిబంధనలు అనుమతించవని స్పష్టమవుతున్నది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి 1998-2011 మధ్య కాలంలో వచ్చిన జీవోలను మేళవించి 2012లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 168లోని నిబంధనల గురించి హైకోర్టు తన ఆదేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
జీవో 168లో ప్రధానాంశాలు
కి.మీ. పరిధిలోనే సాధ్యమా?
హైకోర్టు ఉత్తర్వులు, జీవో 168 ప్రకారం మూసీ నదికి రెండు వైపులా 50 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదు. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తున్న ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు బఫర్‌జోన్ దాటిన తర్వాతనే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, మూసీ సుందరీకరణలో భాగంగా నదీమార్గానికి రెండు వైపులా కిలోమీటరు వరకు భూసేకరణ చేపట్టనున్నట్టు గతంలో ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బఫర్‌జోన్ దాటిన తర్వాత నూటికి 99% ప్రైవేటు ఆస్తులే ఉన్నాయి. ఆ ఆస్తులను సేకరించి కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తే తప్ప సియోల్ తరహాలో ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మార్గం సుగమం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.