హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బె యిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి రూ.3 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్తోపా టు అంతే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ సుమలత ఉత్తర్వులిచ్చారు. నిందితుల పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లొద్దని, చార్జిషీట్ దాఖలు చేసేవరకు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని, కేసుకు సంబంధించి ప్రలోభాలు గురిచేయొద్దని, బెదిరింపులకు పాల్పడొద్దని ఆదేశించింది.
రూ.3 లక్షల బాండ్ ఇవ్వలేరా?
నిందితులు నెలరోజులుగా జైల్లో ఉన్నారని, సిట్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకొన్నందున బెయిల్‌కు అర్హులేనని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ న్యాయవాది జోక్యం చేసుకొంటూ.. నందకుమార్ ప్రభుత్వ ఉద్యోగని, రూ.3 లక్షల బాండ్ సమర్పించలేరని, దానిని తగ్గించాలని కోరారు. దీనిపై సిట్ తరఫున అదనపు పీపీ రమణారావు స్పందిస్తూ రూ.250 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు బేరసారాలు చేసిన వ్యక్తి రూ.3 లక్షల బాండ్ సమర్పించలేరా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..బెయిల్ ఇవ్వొద్దు
ముగ్గురు నిందితులు ఇతర రాష్ర్టాలకు చెం దిన వారని, రూ.250 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని సిట్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారావు వాదించారు. వేరే పాస్‌పోర్టులతో విదేశాలకు పారిపోయే ప్రమా దం ఉన్నదని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసి, సిట్ దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నదని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.