AV Ranganath | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని నిలదీసింది.
ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెకచేయకుండా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధికరణనే పరిపాటిగా మార్చుకున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే అంశంపై మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెప్తున్నాయని పేరొంది. ఇకడ బాధితుడు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోర్టు ఉత్తర్వులను ధికరించడం ఎంతమాత్రం సహించబోమని రంగనాథ్‌కు తేల్చిచెప్పింది. ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పకనపెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీయమని ప్రశ్నించింది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు భూమిలో అడుగు పెట్టరాదన్న ప్రాథమిక సూత్రం తెలియదా అని నిలదీసింది. ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేటు వ్యక్తిపై పోలీసు ఫిర్యాదు ఎందుకు చేశారని ప్రశ్నించింది.
మేడ్చల్-మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతాశ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం ధికరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 17న హైడ్రా అధికారులు భారీ బలగాలతో వచ్చి ప్రహరీగోడను కూల్చివేయడంతోపాటు అకడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఇదే అంశంపై రెండు కోర్టు ధికరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆరోపించారు. కో
ర్టు ఉత్తర్వులు చూపించినా పట్టించుకోకుండా పిటిషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని పేరొన్నారు. అనంతరం పిటిషనర్‌పై పోలీసు కేసు నమోదు చేసి, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని తెలిపారు. దీంతో రంగనాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయమూర్తి ఒక దశలో ఆయనను బలవంతంగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించాల్సి వస్తుందని హెచ్చరించారు. సాయంత్రం 6.30 గంటలకు హాజరవుతానని రంగనాథ్ తెలియజేయడంతో విచారణను అప్పటివరకు వాయిదా వేశారు. సాయంత్రం కోర్టు ముందు హాజరైన రంగనాథ్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టంచేశారు. ఇంత అహంకార ధోరణి ప్రభుత్వ అధికారికి తగదని అన్నారు.
పిటిషన్లో పేరొన్న వివరాల ప్రకారం మేడ్చల్-మలాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిపై తమకు పూర్తి యాజమాన్య హకు ఉందని, ఈ భూమికి సంబంధించిన వివాదంలో 2021లో హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని శాంతాశ్రీరాం కన్స్ట్రక్షన్స్ సంస్థ తెలిపింది. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో గతంలోనే కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ కేసుల విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం హైడ్రా సహా ఏ ప్రభుత్వ శాఖ కూడా తమ ప్రైవేటు భూమిలోకి ప్రవేశించదని, ఎలాంటి జోక్యం చేసుకోదని అండర్ టేకింగ్ ఇచ్చిందని పేరొంది. ఈ ఏడాది మే చివరి నుంచి జూన్ తొలి వారం వరకు పలుమార్లు అధికారులు స్థలానికి వచ్చి అభివృద్ధి పనులను అడ్డుకున్నారని, కోర్టు ఉత్తర్వులు, యాజమాన్య పత్రాలు చూపించినా పట్టించుకోలేదని తెలిపింది. జూలై 17న ఉదయం భారీ సంఖ్యలో హైడ్రా సిబ్బంది, పోలీసులు, జేసీబీలు, ఇతర వాహనాలతో స్థలంలోకి ప్రవేశించి ప్రహరీ గోడలు, టిన్‌షీట్లు, ఇతర నిర్మాణాలను కూల్చివేశారని, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని పిటిషన్లో ఆరోపించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరసయ్యతోపాటు మరికొందరిని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారని పేరొన్నారు. ఈ చర్యలన్నీ హైకోర్టు ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘించినట్లేనని తెలిపారు.
సదరు భూమి రక్షణ శాఖకు చెందినదైతే.. ఆ శాఖను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని న్యాయమూర్తి నిలదీశారు. సివిల్ కోర్టు సహా ఎకడా ప్రస్తావనలో లేని రక్షణ శాఖ అంశాన్ని ఇప్పుడు ఎలా తెరపైకి తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే వాటికి విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను అనుమతించలేమని, ప్రభుత్వం తరఫున ఇది అత్యంత అనుచితమైన వ్యవహారమని అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించి పేరొన్నారు. పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని ప్రతిని ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ అందజేయాలని ఆదేశించారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు . విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. విచారణకు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, ప్రత్యేక న్యాయవాదులు, హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ సమీర్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.