KTR : బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) పై ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపించారు. దాంతో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ గత ఏడాది సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు ఆయనపై 2024 సెప్టెంబర్ 30న కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ తాజా తీర్పు వెలువరించారు. కేటీఆర్‌పై కేసును కొట్టివేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.