ఆర్ఎస్ ప్రవీణ్‌కు భద్రతను కొనసాగించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బుల్లెట్‌ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బుల్లెట్‌ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గం డ్ర మోహన్‌రావు వాదిస్తూ.. ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్ ఐపీఎస్ అధికారింగా ఉండ గా గతంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతా ల్లో పనిచేశారని గుర్తుచేశారు.
ఈ కారణంగా పిటిషనర్ ప్రాణాలకు ముప్పు ఉన్నదని తెలిపారు. ఆయనకు భద్రతను ఉపసంహరించే ముందు ఎలాంటి అధ్యయనం చేయలేదని తప్పుపట్టారు. వాదనల అనంతరం హైకోర్టు.. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వెనకి తీసుకోరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

