ఏకసభ్య కమిషన్‌పై వివరణ ఇవ్వండి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం ఏకసభ్య కమిషన్‌ను నియమించడంపై దాఖలైన అప్పీళ్లలో వివరణ ఇవ్వాలంటూ హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, జూన్ 24,( నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం ఏకసభ్య కమిషన్‌ను నియమించడంపై దాఖలైన అప్పీళ్లలో వివరణ ఇవ్వాలంటూ హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సింగిల్‌జడ్జి ఇటీవల తీర్పు వెలువరిస్తూ.. ఏకసభ్య కమిషన్‌గా జస్టిస్ నవీన్‌రావును నియమిస్తూ, హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణతోపాటు ఇతర కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సిట్ ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఏ అంబర్‌పేట క్రికెట్‌క్లబ్, జిందాతిలిస్మాత్ క్రికెట్ క్లబ్, సాగర్ క్రికెట్ క్లబ్‌లు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కొందరు తప్పుచేశారన్న కారణంగా మొత్తం కమిటీనే తప్పుగా పరిగణనలోకి తీసుకోవడం సరికాదని వాదించారు. వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, సంబంధిత రికార్డులను సమర్పించాలని హెచ్సీఏతోపాటు సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

