హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తారో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు చివరి అవకాశాన్ని ఇస్తున్నామని, మరోసారి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదంటూ సింగిల్ జడ్జి తీర్పు వెలువరించినందున తమ భూములపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన దాదాపు 50 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ దివ్య వాదనలు వినిపిస్తూ.. అకడ బల్‌డ్రగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం లేదని, లైఫ్‌సైన్సెస్ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారని చెప్పారు. దీంతో ఏ అధికారి ఆ వివరణ ఇచ్చారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది.
అధిక లాభాల కోసం ఆశపడి ;అప్పుల్లో కూరుకుపోయి విద్యార్థి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6: అధిక లాభాల కోసం ఆశపడిన ఓ విద్యార్థి లోన్ యాప్‌లో పెట్టుబడి పెట్టి, మోసపోయి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా మద్దూర్‌కు చెందిన రుమాండ్ల భానుప్రకాశ్ (22) తల్లి కృష్ణవేణితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రామాంతాపూర్‌లోని అరోరా కళాశాలలో ఎంసీఏ చదువుతున్న భానుప్రకాశ్.. టెలిగ్రామ్ యాప్ ద్వారా తనకు వచ్చిన సందేశాలను చూసి ఓ లోన్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. ఆరంభంలో మంచి లాభాలు రావడంతో దాదాపు రూ.65 వేలు డిపాజిట్ చేశాడు. కానీ, ఆ నగదుతోపాటు లాభం తన ఖాతాలో జమకాకపోవడంతో మెసేజ్ ద్వారా ఆ లోన్ యాప్ నిర్వాహకులను సంప్రదించాడు. దీంతో భానుప్రకాశ్ ఖాతాలో రూ.10 లక్షల బ్యాలెన్స్ ఉంటేనే డిపాజిట్, లాభం వస్తుందని లేకుంటే ఆ సొమ్ము రాదని లోన్ యాప్ నిర్వాహకుల నుంచి సమాధానం వచ్చింది. ఈ క్రమంలో బంధుమిత్రుల అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన భానుప్రకాశ్ గురువారం రాత్రి తన తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం భానుప్రకాశ్ ఆచూకీ కోసం గూగుల్ యాప్ ద్వారా వెతకడంతో జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు వద్ద అతని ఫోన్ లొకేషన్‌ను చూపించింది. అక్కడ చెరువు కట్టపై ద్విచక్రవాహనంలో అతని సెల్‌ఫోన్, ఇతర వస్తువులు ఉన్నప్పటికీ భానుప్రకాశ్ మాత్రం కనిపించలేదు. దీనిపై శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఫాక్స్‌సాగర్ చెరువు నుంచి భానుప్రకాశ్ మృతదేహాన్ని వెలికితీసి, గాంధీ దవాఖానకు తరలించారు.