హైదరాబాద్, జులై 8 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి ఆదాయపన్నుశాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఐటీ శాఖ నోటీసును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నోటీసులను రద్దు చేసింది.