హైదరాబాద్,జూలై 26 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితకు బుధవారం హైకోర్టు వీడోలు చెప్పింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరధే అధ్యక్షతన ఆమె వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జస్టిస్ లలిత సేవలను కొనియాడారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఛతీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి సామ్కోశాయ్ బదిలీపై ఇకడికి రానున్నారు.