High Court | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ) : మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించడానికి అనుమతులు అవసరమా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ అనుమతులు అవసరమనుకుంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎకడ ఉన్నాయో చెప్పాలని స్పష్టం చేసింది. అధికారిక రహస్యాల చట్టం కింద ఒక ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా ప్రకటించాలంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉటుందని, అలా మేడిగడ్డకు సంబంధించి కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ ఏమైనా ఉంటే సమర్పించాలని ఆదేశించింది. దీనితోపాటు ఈ కేసులో నమోదు చేసిన 8 మంది సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.