హైదరాబాద్ జనవరి 3 (నమస్తే తెలంగాణ) : మార్గదర్శి ఫైనాన్షియర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు నమోదైన కేసులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 13 సార్లు ఈ కేసు విచారణ జరిగినప్పటికీ రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు కౌంటర్లు వేయలేదని గుర్తుచేస్తూ.. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని ప్రశ్నించింది. చివరిసారిగా 3 వారాల గడువు ఇస్తున్నామని, ఈసారి కూడా కౌంటర్లు వేయకపోతే విచారణకు హాజరుకావాల్సిందిగా రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను ఆదేశిస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఆ లోగా అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని రిజర్వు బ్యాంకును కూడా ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణి ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.